70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హులైన వారి పేర్లను నమోదు ప్రక్రియను చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.