ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ప్రస్తుతం నెల్లూరు అధికారుల ఆధీనంలో ఉన్నారు ఆనందయ్య. ఇక నిన్న ఆయూష్ కమిషనర్ రాములు సమక్షంలో మందు తయారు చేసారు ఆనందయ్య. అయితే ఆ మందులో హానికర పదార్థాలు లేవని ఆయూష్ కమిషనర్ పేర్కొన్నారు. కానీ ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్న రాములు… ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా…