అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రజలను నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభినందించారు. భారతదేశంలో సోదరభావం తగ్గిపోతోందని, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం తెలిపాయి.
Ram Mandir : రామనగరి అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22, 2024 లోపు అవసరమైన పనిని పూర్తి చేయడానికి వందలాది మంది కార్మికులు పగలు, రాత్రి పనిచేస్తున్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానించింది. రామమందిర నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన అద్వానీ, జోషిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని మొదట ఆలయ ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. వారి వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఈ వేడుకకు రావోద్దని వారిని అభ్యర్థించినట్టు రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వారి వయస్సును పరిగణనలోకి…
Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22 శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన అట్టహాసంగా జరగబోతోంది. శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే గర్భగుడిని నిన్న ఆలయ ట్రస్ట్ ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది. ఇదిలా ఉంటే రామమందిరంలో పూజారులుగా పనిచేయడానికి ఎంపికైన 50 మందిలో ఘజియాబాద్‌కి చెందిన యువకుడు ఉన్నారు. దూధేశ్వర్ వేద విద్యాపీఠంలో ఏడేళ్ల చదివిన తర్వాత మోహిత్ పాండే తిరుపతి వెళ్లి వేద విద్యను అభ్యసించారు. ఇతరుల…
Ayodhya Ram Temple: భవ్య రామమందిర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. పనులు వేగంగా పూర్తవుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రానున్నారు. మోడీతో పాటు దేశంలోని రాజకీయ నాయకులతో పాటు 3000 మంది వీవీఐపీలో సహా 7000 మంది అతిథులను ఆహ్వానించేందుకు శ్రీ రామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ సిద్ధమైంది.
Ayodhya Ram Temple: అయోధ్య రామమందిర శంకస్థాపన కోసం వడివడిగా పనులు జరుగుతున్నాయి. 2024 జనవరి 22న రామమందిర ప్రతిష్టాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా శ్రీరామ విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది. ఇప్పటికే అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక అందించింది.
Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ గౌరవించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో రాముడి ఆలయం వచ్చేదా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున యోగి ప్రచారం చేశారు. ఎంపీలోని పావై, అశోక్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
Rajnath Singh: ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని గురుద్వారా అలంబాగ్లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమోధ్యలో రామమందిరం కోసం దేశంలోని సిక్కు సమాజం ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
Uddhav Thackeray: రామమందిర ప్రారంభోత్సవ సమయంలో ‘గోద్రా’ తరహా కుట్ర జరుగుతుందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలకు నెల రోజుల ముందు అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా లక్షల్లో హిందువలు హాజరయ్యే అవకాశం ఉంది.