Ayatollah Ali Khamenei: జూన్ 22వ తేదీన ఇరాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు దిగింది. ఈ ఘటనపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్- అమెరికాలపై ప్రతిస్పందన తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు. శత్రువులు తమ సహనాన్ని రెచ్చగొడితే ఆ తర్వాత కఠినమైన శిక్షను ఎదుర్కుంటారని తేల్చి చెప్పారు. మేము దాడి చేస్తే ఎలా ఉంటుందో త్వరలోనే యూఎస్, టెల్ అవీవ్ తెలుసుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇక, ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే మూడు అణు కేంద్రాలపై అమెరికా దురాక్రమణకు పాల్పడిందని ఆరోపించారు.
Read Also: Sourav Ganguly: వీవీఎస్ లక్ష్మణ్ నాతో 3 నెలలు మాట్లాడలేదు!
మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ మాట్లాడుతూ.. అమెరికా తప్పకుండా ఇరాన్ ప్రతిస్పందనను స్వీకరించాల్సి ఉంటుందని వెల్లడించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌పై జరిగిన అత్యంత తీవ్రమైన పాశ్చాత్య సైనిక దాడులు ఇవి అని పేర్కొన్నారు. మా దేశ అత్యున్నత ప్రయోజనాలకు ముప్పు కలిగించేలా ఇజ్రాయెల్, యూఎస్ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డాయని తెలిపారు.
#همین_حالا
مجازات ادامه دارددشمن صهیونی یک اشتباه بزرگی کرده، یک جنایت بزرگی را مرتکب شده؛ باید مجازات بشود و دارد مجازات میشود؛ همین حالا دارد مجازات میشود.#الله_اکبر pic.twitter.com/wH6Wk9nNhJ
— KHAMENEI.IR | فارسی 🇮🇷 (@Khamenei_fa) June 23, 2025