బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. అయాన్ తొలి చిత్రం ‘వేకప్ సిద్’ 2009లో వచ్చింది. అందులో హీరో రణబీర్ కపూర్. ఆ తర్వాత నాలుగేళ్ళకు అంటే 2013లో అయాన్ రెండో సినిమా ‘యే జవానీ హై దివానీ’ వచ్చింది. అందులోనూ రణబీరే హీరో. ఇప్పుడు ఏకంగా తొమ్మిదేళ్ళ తర్వాత అయాన్ ముఖర్జీ మూడో సినిమా ‘బ్రహ్మస్త’ రాబోతోంది. ఇందులోనూ రణబీర్ కపూరే హీరో.…
బీటౌన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ బిగ్ మూవీ “బ్రహ్మాస్త్ర పార్ట్-1 : శివ”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించగా, ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం బీటౌన్ మొత్తం రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 14న ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో…
ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మస్త్ర’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్…