అమెజాన్ భారత్‌లో 35 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో దేశంలోని ఇ-కామర్స్, లాజిస్టిక్స్, డేటా సెంటర్లు, డిజిటల్ సేవలు వంటి రంగాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత మార్కెట్‌లో ఉన్న విస్తృత అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కంపెనీ తెలిపింది. కొత్త పెట్టుబడితో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, చిన్న, మధ్య తరహా వ్యాపారాల డిజిటల్ వికాసానికి కూడా ఇది తోడ్పడనుంది. అమెజాన్ భారత…