ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం శీతకన్ను వేసిందంటూ తెగ ఫీలవుతున్నారట తమ్ముళ్లు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు సెగ్మెంట్స్‌లో ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జ్‌లు లేరు. ఈ మూడింటిలో రెండు చోట్ల బీజేపీ, అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉంటే అందులో 13 చోట్ల టీడీపీ గెలవగా... మిగతా మూడింటిని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి పోటీ చేయటానికి కొందరు…
పిఠాపురంలో పవన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2024లో వచ్చేది జనసేన - టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి ఉన్న నేతను ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసన్నారు. తమకు నైతికంగా బలం ఉంది కాబట్టే.. నేనింత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే వాడిని అయ్యామన్నారు. తాను ప్యాకేజ్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని.. తనకు డబ్బంటే ప్రేమ లేదని వాళ్లకెలా చెప్పనంటూ పేర్కొన్నారు.
ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
Loan App Harassment: కృష్ణా జిల్లా అవనిగడ్డలో లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. చల్లపల్లికి చెందిన మహమ్మద్ లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ పాల ఫాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహమ్మద్.. హీరో ఫైనాన్స్ కార్పొరేషన్‌లో లోన్ తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లిస్తున్నా.. ఇంకా కట్టాలంటూ అసభ్యకర మెసేజ్‌లు, కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్లు చేసి వేధించారు. ఆ వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మహమ్మద్. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు…