Loan App Harassment: లోన్‌యాప్ వేధింపులు.. ఏపీలో మరో యువకుడు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loan App Harassment: కృష్ణా జిల్లా అవనిగడ్డలో లోన్‌యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. చల్లపల్లికి చెందిన మహమ్మద్ లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ పాల ఫాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహమ్మద్.. హీరో ఫైనాన్స్ కార్పొరేషన్‌లో లోన్ తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లిస్తున్నా.. ఇంకా కట్టాలంటూ అసభ్యకర మెసేజ్‌లు, కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్లు చేసి వేధించారు. ఆ వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మహమ్మద్. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్‌కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. ఐదు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, లింక్‌లు పంపి మరీ… లోన్ అడగకుండగానే.. లోన్ ఇచ్చేస్తున్న లోన్ యాప్‌లు.. ఆ తర్వాత వేధింపులకు గురిచేస్తూ ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. లోన్ యాప్‌ల జోలికి వెళ్లొద్దని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నా.. చాలా మంది ఇప్పటికీ వాటిని ఆశ్రయిస్తూనే ఉన్నారు.. వారి వలలో చిక్కుకుని వేధింపులు ఎదుర్కొంటున్నారు.. కొందరు ప్రాణాలు తీసుకుని.. వారి కుటుంబాన్ని విషాదంలో ముంచేస్తున్నారు. అవసరం అయితే.. బయట అప్పు చేయండి.. కానీ, లోన్ యాప్‌లను ఆశ్రయించవద్దు అని పోలీసులు సూచిస్తున్నారు.. ఇక, కొన్ని లోన్ యాప్‌లను బ్యాన్ చేసిన విషయం విదితమే.
Read Also: Jagadish Reddy : బండి సంజయ్ అజ్ఞానంతో అబద్దాలు మాట్లాడుతున్నాడు
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!