గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత రీతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ సాధించిన విషయం ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. ఈ సిరీస్ విజయం సాధించడంలో తాత్కాలిక కెప్టెన్ రహానె కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ విజయానికి తన నిర్ణయాలు కారణమైతే.. మరొకరు తమ ఘనతగా చెప్పుకున్నారని రహానె విమర్శించాడు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం, పలువురు…