భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. అక్టోబర్ 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ వన్డే సిరీస్ ముందు ఆతిథ్య ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 19న పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి వన్డేకు స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. వీరి స్థానంలో మాథ్యూ కున్నెమాన్, జోష్ ఫిలిప్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టులోకి తీసింది. ఆడమ్ జంపా సతీమణి న్యూ సౌత్…