టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఈరోజు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో కూడా యువ ఆటగాళ్లకే టీమిండియా అవకాశం కల్పిస్తుంది. దీంతో జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది.