AUS vs IND: అతడు గంభీర్ మనిషి.. గొప్ప ప్రదర్శన చేయకున్నా జట్టులో ఉంటాడు!
- అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్
- సీనియర్ ప్లేయర్స్ రోహిత్, కోహ్లీలకు స్థానం
- ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా స్థానం
- హర్షిత్ గొప్ప ప్రదర్శన లేకున్నా జట్టులో ఉంటాడన్న శ్రీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అక్టోబర్ 19న మొదలయ్యే వన్డే సిరీస్ జట్టులో సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం దక్కింది. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ సారథిగా ఎంపికయ్యాడు. రెండు సిరీస్‌లలో చాలా తక్కువ మందికి చోటు దక్కగా.. అందులో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఇటీవలి సిరీస్‌లలో జట్టులో ఉంటున్నా.. ఎక్కువగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాల్లో గొప్ప ప్రదర్శన అయితే చేయలేదు. అయినా కూడా హర్షిత్ జట్టులో కొనసాగుతున్నాడు. హర్షిత్ ఎంపికపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ అయ్యారు.
క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు హర్షిత్ రాణా ఇష్టమైన వ్యక్తి అని విమర్శించారు. ‘గంభీర్‌కు హర్షిత్ రాణా ఇష్టమైన ప్లేయర్. అందుకే అతడు భారత జట్టులో ఉంటున్నాడు. హర్షిత్‌కు గౌతీ చాలా ప్రాధాన్యం ఇస్తాడు. గంభీర్ ఇష్టమైన ప్లేయర్ జాబితాలో శుభ్‌మన్ గిల్ తర్వాత హర్షిత్ పేరే ఉంటుంది’ అని శ్రీకాంత్ చమత్కరించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన రాణా.. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో జట్టులోనే ఉన్నాడు. ఆసియా కప్, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్‌లు వరుసగా ఆడిన బుమ్రాకు ఆస్ట్రేలియా పర్యటనలోని వన్డేలకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Also Read: 314 Runs: మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్.. వన్డేల్లో 314 రన్స్ బాదిన భారత బ్యాటర్!
నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికై కూడా క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. ‘ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. నితీశ్ మెరుగైన ప్రత్యామ్నాయం కాదని నా అభిప్రాయం. రవీంద్ర జడేజా మంచి ఎంపిక. అతడు బెస్ట్ ఆల్‌రౌండర్. నితీశ్‌ను బ్యాటర్‌గానే ఆడించాలి. అతడు బౌలింగ్ చాలా తక్కువగా వేస్తాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ నితీశ్‌ను తీసుకోలేదు. వన్డే ప్రపంచకప్ 2025 ప్లానింగ్‌లో అతడు ఉంటాడని నేను అనుకోవడం లేదు’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!