Today Business Headlines 31-03-23: వెయ్యి మందికి జాబ్స్: హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ సర్వీసుల సంస్థ ప్లూరల్ టెక్నాలజీస్.. వచ్చే మూడు సంవత్సరాల్లో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వాళ్లను టెక్నాలజీ కన్సల్టెంట్లుగా నియమించుకొని.. అందులో సగం మందికి జపనీస్ భాషలో ట్రైనింగ్ ఇవ్వనుంది. జపాన్ పార్ట్నర్ కంపెనీ సీసమ్ టెక్నాలజీస్‌తో కలిసి 2025 చివరి నాటికి ఎంటర్‌ప్రైజెస్ టెక్నాలజీ సర్వీసెస్‌లో 10 కోట్ల డాలర్ల బిజినెస్ చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.