రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ తెల్లవారుజామున 5 గంటలకే దాదాపు 50 మంది విద్యార్థినిలు రోడ్డెక్కారు.