Ekalavya Model School: ప్రిన్సిపల్, వార్డెన్, అటెండర్ వేధిస్తున్నారు.. రోడ్డెక్కి విద్యార్థినిలు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ekalavya Model School: విద్యార్థినులపై వేధింపులు, దురుసుగా ప్రవర్తించడం పై ప్రభుత్వాలు, అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. వారికి వార్నింగ్ లు ఇస్తున్నా.. అయినా వారిపై స్కూల్ యాజమాన్యం మాత్రం అలానే ప్రవర్తిస్తూ.. నరకయాతన చూపిస్తున్నారు. వారిని వేధిస్తూ అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థినులు ఎదురు తిరిగితే వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ నరకాన్ని చూపిస్తున్నారు. దీంతో విసుగు చెందిన విద్యార్థినులు రోడ్డెక్కారు. న్యాయం జరగేంత వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. ఈఘటన దుమాల గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ వద్ద చోటుచేసుకుంది.
Read also: Chain Snatchers: వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు.. నగరంలో పోలీసుల తనిఖీలు..
Also Read
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ తెల్లవారుజామున 5 గంటలకే దాదాపు 50 మంది విద్యార్థినిలు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు మద్దతు పలికారు. విద్యార్థులను స్థానిక అధికారులు బుజ్జగిస్తున్నారు. తమకు న్యాయం చేసేంతవరకు కదిలేది లేదంటూ చలిలోనే విద్యార్థినిలు భీష్ముంచు కూర్చున్నారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తగిన బుద్ది చెప్పాలని చెలిని సైతం లెక్కచేయకుండా న్యాయం కోసం రోడ్డు పై బైఠాయించడం చర్చకు దారితీసింది. విద్యార్థినిలపై అధికారులు ఎంతగా వేధించి వుంటే విద్యార్థినులు సహనం కోల్పోయి వుంటారని స్థానికులు చెబుతున్నారు. వారిపై నమ్మకంతో పిల్లల తల్లిదండ్రులు వదిలి వెళితే.. ఇదే అలుసుగా భావించి ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి పిల్లలను వేధించడం సరైన పద్దతి కాదని చెబుతున్నారు. వారికి తగిన బుద్డి చెప్పాలని కోరుతున్నారు. విద్యార్థినులకు న్యాయం చేయాలని విజ్ఙప్తి చేస్తున్నారు. కేటీఆర్ జిల్లాగా చెప్పుకునే రాజన్న సిరిసిల్లలో విద్యార్థినులపై ఇలా జరగడం చర్చకు దారితీస్తోంది.
read also: Armed Vigilante Groups: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ గ్రామస్థుల చేతికి ఆయుధాలు
గతేడాది ఫిబ్రవరిలో కరీంనగర్ పాలిటెక్నికల్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాగా..విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్ వక్రమార్గం పట్టారని ఆరోపించారు. విద్యార్థకులను మానసికంగా శారిరకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పై అధికారులు చెప్పినట్టు వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ ప్రిన్సిపల్ రాంబాబు బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని ఆరోపించారు కరీంనగర్ వెటర్నరీ కళాశాల విద్యార్థులు. అయితే.. కరీంనగర్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక.. విద్యార్థులకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు తెలిపింది. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రిన్సిపాల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Armed Vigilante Groups: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ గ్రామస్థుల చేతికి ఆయుధాలు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..