Vallabhaneni Vamsi: వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. బెజవాడ మాచవరం పోలీసులు వంశీపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీ పై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. వంశీని అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.…
Tirupati: తిరుపతి జిల్లా వెంకటగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వివరాల ప్రకారం.. పాపన హరిప్రసాద్ (32), లక్ష్మీ మౌనిక దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో భార్య, పిల్లలను తీసుకెళ్లేందుకు హరిప్రసాద్ శుక్రవారం అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరిగింది.…
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి విజయవాడ మాచవరం పోలీసులకు ఈనెల 17న ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు కేసు ఫైల్ చేశారు. వంశీతో పాటు ఎనిమిది మందిపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన సంగతి తెలిసిన దగ్గర్నుంచి వంశీ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీ తో పాటు కేసులో నిందితులుగా…