Medical Stores: ఏపీలో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై దాడులు
- ఏపీలో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై దాడులు
- ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు
- అనుమతి లేని మందులు విక్రయించే వారిపై చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్, పోలీస్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఈగల్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత, రికార్డులను అధికారులు పరిశీలించారు. విజిలెన్స్ ఎస్పీ ఎం.స్నేహిత, డ్రగ్స్ ఏడి నాగమణి రాజమండ్రి తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీలు చేశారు. మెడికల్ గా ఒకే మోతాదులో వినియోగించే సిరఫ్, ఇంజక్షన్లు మత్తు మందులను కొంతమంది యువత అక్రమంగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాలతో మెడికల్ షాపులలో నాలుగు ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి.
Also Read:Ireland: ఐర్లాండ్ అధ్యక్ష పదవికి యూఎఫ్‌సీ ఫైటర్ పోటీ.. ట్రంప్ హామీతో బరిలోకి!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
రాజమండ్రిలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తిరుమల ఏజన్సీ లో విక్రయిస్తున్న ట్రమడాలు మత్తుమందు 255 ఇంజక్షన్లను విజిలెన్స్ ఎస్పీ స్నేహిత పట్టుకున్నారు. యువత కొంతమంది తప్పుడుగా వైద్యం కోసం వినియోగించే మత్తు కలిగించే మెడిసిన్స్ ను విరివిగా వాడుతున్నట్టు సమాచారం. అందుకే డిజేపీ ఆదేశాలతో జిల్లాలో 16 చోట్ల దాడులు చేస్తున్నామని తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ ఏజెన్సీలో, మెడికల్ షాపులలో ట్రమాడాల్ ఇంజక్షన్లు, మత్తు కలిగించే సెరఫ్ లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read:Gautam : యాక్టింగ్‌తో అదరగొట్టిన మహేశ్ కొడుకు గౌతమ్.. వీడియో వైరల్
రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ నిర్వాహిస్తున్నామని ఈగల్ టీమ్ ఐజీ రవి కృష్ణ తెలిపారు. గుణదల మెడికల్ షాప్ లో ఆకస్మిక దాడులు చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతి లేని మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలి. అలా లేనియెడల వారిపై చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!