Crime: తనలో మాట్లాడటం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిలా ప్రవర్తించాడు. మహిళ గొంతు కోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో జరిగింది. 23 ఏళ్ల వ్యక్తి మహిళ గొంతు కోసం గాయపరిచినందుకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఇండోర్‌కి 40 కి.మీ దూరంలోని సాన్వర్ పట్టణంలో అమన్ షేక్ అనే నిందితుడు ఎంబీఏ విద్యార్థినిపై కత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.