ఏపీలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని ఒకవైపు విపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. మరోవైపు వైసీపీ పాలన బాగాలేదని ఎవరైనా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తే ఆ పార్టీనేతలు దాడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకాయమ్మ ఘటన ఏపీలో సంచలనం కలిగిస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పినందుకు తన ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చింది ఎస్సీ మహిళ వెంకాయమ్మ. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన…