1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 2. నేడు తిరుపతి, శ్రీకాళహస్తిలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 3. నేటి నుంచి వైసీపీ ప్లీనరీపై పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాల నిర్వాహణ జరుగనుంది. 4. నేడు ఈడీ విచారణకు హాజరుకాలేనన్న సోనియా…
మూడేళ్ల వైసీపీ పరిపాలనలో రాయలసీమ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందన్నారు. రాయలసీమలో పర్యటించకపోయిన ఫర్లేదు…. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ప్రజా తీర్పు…వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యం,క్రీడల పై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఇవ్వాళ్టితో ఉప ఎన్నిక ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోసం ఆపార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు లో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక్కడ రోడ్లు గుంతలు చూడలేక మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారు. మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో తిరుగుతున్నారు.…
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.…
ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరి సవాల్‌లు విసురుకుంటున్నారు. అయితే తాజాగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు అవాస్తవాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆత్మకూరు అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా లో క్రాప్ హాలిడే ప్రకటించారు అనడం బాధాకరమని, 40-45 వేల ఎకరాలు నెల్లూరు జిల్లాలో వరి సాగు చేస్తున్నారని, 15,800…
ఏపీలో బీజేపీ నేతలు అధికారపార్టీపై దాడి ముమ్మరం చేశారు. ఆత్మకూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని వైసీపీ వమ్ము చేసిందన్నారు. నెల్లూరు జిల్లాలో పుష్కలంగా జలవనరులతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిఉన్నా…రైతులు అనధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు, సోమశిల ప్రాజెక్టు…
ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజుల్లోనే ఎన్నికల సమరం జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారంతో నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. మొత్తం 28 నామినేషన్‌లలో 13 మంది అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ దూరంగా ఉండటంతో పోటీ ప్రధానంగా వైసీపీ, బీజేపీల…