ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రూపొందించిన ‘క్రష్’ మూవీతో హీరోగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు కృష్ణ బూరుగుల. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కృష్ణ లోని నటుడిని పరిశ్రమకు తెలియచేసింది. దాంతో కృష్ణ బూరుగుల పలు అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. అతను హీరోగా నటించిన రెండో సినిమా ‘మా నాన్న నక్సలైట్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. అందులో నక్సలైట్ కుమారుడి…