సెప్టెంబర్ 21న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేసారు. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్‌కి తన రాజీనామాను సమర్పించారు. అతిషి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దావా వేశారు.