ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఏపీ బీజేపీ కార్యాచరణ సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ రేపు కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మురళీధరన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కడప జైలులో ఉన్న నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలను కేంద్ర మంత్రి మురళీధరన్ పరామర్శిస్తారు. కడప…