అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఏటీసీ టైర్స్ కంపెనీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని సీఎం జగన్‌ను ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కూడా పాల్గొన్నారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు…