Himanta Biswa Sarma: ‘‘ సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’.. అస్సాం సీఎం ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ వివాదాస్పద వ్యాఖ్యల్లోనే కాదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ పోస్టులే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రెండింగ్‌కి తగ్గట్లు పోస్టులు చేస్తుంటారు. ప్రస్తుతం హిమంత చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యం పొందిన డైలాగ్స్‌తో యువత రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ రీల్స్ ట్రెండ్ హిమంతను కూడా ఆకట్టుకున్నట్లు ఉంది.
‘సో బ్యూటిఫుల్, సోలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అంటూ ఓ బట్టల దుకాణంలో మహిళ చేసిన సందడి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడింగ్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాస్మీన్ కౌర్ అనే మహిళ ఉత్సాహంగా సల్వార్ సూట్‌లను విక్రయిస్తున్న వీడియో ఈ డైలాగ్ చెప్పింది. ఇదే డైలాగ్‌ని ఉపయోగించి అస్సాం సీఎం ఓ వంతెన అందాన్ని వివరిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది.
Also Read
- Abhijeet Dipke: సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
Read Also: Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..
అస్సాంలోని తేజ్‌ఫూర్‌లోని కోలియా భోమెరా వంతెన అద్భుతమైన ఫోటోలు, వంతెనతో పాటు హిమాలయాల అందాలను తన పోస్టులో పంచుకుంటూ..‘‘సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’ అంటూ ట్వీట్ చేశారు. తేజ్‌పూర్ లోని కొలియా భోమెరా సేతు నుంచి శీతాకాలపు ఉదయంలో కనిపించే హిమాలయాలు. తక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, కాలుష్య రహిత వాతావరణ అద్భుతమైన పర్వతం అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఫోటో నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. అద్భుతం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కోలియా భోమోరా సేతు 1987లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడింది. ఉత్తర ఒడ్డున సోనిత్ పూర్ జిల్లాలోని తేజ్‌పూర్‌ను దక్షిణ ఒడ్డుపై ఉన్న నాగోల్ జిల్లాలోని కలియాబోర్‌తో కలుపుతుంది. ఈ వంతెనకు అస్సామీ జనరల్ కాలియా భోమోరా ఫుకాన్ పేరు పెట్టారు. మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన 7 ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంది.
Another capture 👇
"So beautiful, So Elegant, Just Looking Like a WOW!" pic.twitter.com/XyzLEYJ1XW
— Himanta Biswa Sarma (@himantabiswa) November 12, 2023
తాజావార్తలు
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్‌ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్‌ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!