వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ లక్షా 24 వేల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికి అందించడంలో విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అవార్డుకు అర్హత సాధించారు. తిరుపతి రూరల్ పరిధిలోని చిగురువాడ అకార్డ్ స్కూల్ అవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..…