India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మైదానంలోనూ ఘోరంగా అవమానించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, తన చర్యను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సమర్థించుకున్నాడు.
ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన అప్ఘాన్ సేన తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
Team India: ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియాపై పలువురు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అసలు టీమిండియా ఆసియాకప్‌కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ పరమ చెత్తగా ఉందని.. అతడి నిర్ణయాలు అంతుబట్టలేని విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆసియా కప్‌ను ప్రయోగాల కోసం వాడుకుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌పైనా దుమ్మెత్తి పోస్తున్నారు. టీ20 ప్రపంచకప్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా టీమ్ సెట్ కాకపోవడం ఏంటని…