India Stills Can Qualify Asia Cup Final If This Wonder Happen: అవును.. సూపర్-4 దశలో భారత్ రెండు పరాజయాలు చవిచూసినప్పటికీ, ఫైనల్‌కి వెళ్లేందుకు ఇంకా ఒక అవకాశం ఉంది. కాకపోతే.. అందుకు అద్భుతాలే జరగాల్సి ఉంటుంది. సూపర్-4 దశలో పాకిస్తాన్‌తో బుధవారం ఆఫ్ఘనిస్తాన్, అలాగే సెప్టెంబర్ 9న శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఆ రెండు మ్యాచుల్లోనూ పాకిస్తాన్ ఓడిపోవాలి. అదే విధంగా.. సెప్టెంబర్ 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్ భారీ పరుగులతో విజయం సాధించాలి. ఇలా జరిగితే.. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్ ఆధారంగా.. భారత్‌కు ఫైనల్‌లో అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. కానీ.. ఇది దాదాపు అసాధ్యమే!
ఎందుకంటే.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల కంటే పాకిస్తాన్ చాలా పటిష్టంగా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టేస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తూ బౌలింగ్ విభాగం ఫెయిలైతే, బ్యాట్‌తో రప్ఫాడించే బ్యాట్స్మన్లు పాక్‌లో ఉన్నారు. లంక, ఆఫ్ఘన్ జట్లు మాత్రం అంత నిలకడగా లేవు. అఫ్‌కోర్స్.. ఈ టోర్నీలో రెండు జట్లూ దూసుకుపోతున్న మాట వాస్తవమే కానీ, పాక్‌తో పోలిస్తే మాత్రం కాస్త బలహీనమైనవే. కాబట్టి, ఆ రెండు జట్లు పాక్‌ని ఓడించడం అంత సులువు కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు.. అద్భుతాలు జరిగితే తప్ప భారత్ ఫైనల్‌కి చేరుకోలేదు. ఆ రిజల్ట్ ఏంటో, ఈ రోజు పాకిస్తాన్ & ఆఫ్ఘన్ మధ్య జగరనున్న మ్యాచ్‌తో తేలిపోనుంది. ఇప్పుడు భారత్ పరిస్థితి.. దింపుడు కల్లం ఆశలాగా తయారైపోయింది. చనిపోయిన వ్యక్తిని స్మశానంలో పాతిపెట్టడానికి ముందు చూస్తే, తిరిగి లేస్తాడా? లేదు కదా!