2025 ఆసియా కప్ గెలిచిన భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నఖ్వీ తన హోటల్ గదికి ట్రోఫీని తీసుకెళ్లాడు. నఖ్వీ ప్రవర్తనపై విస్తృత విమర్శలు వచ్చాయి. తాజాగా మొహ్సిన్ నఖ్వీ భారతదేశానికి ట్రోఫీని అందించడానికి తన సుముఖతను వ్యక్తం చేశాడు. ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ భారత జట్టుకు ట్రోఫీని అందించడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఆయన ఒక షరతు…
Surya Kumar Yadav: దుబాయ్‌లో ఆసియా కప్ 2025 ను భారత్ కైవసం చేసుకుంది. ఇక టోర్నీని గెలిచిన తర్వాత ట్రోఫీని తిరస్కరించిన సంఘటనపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జట్టు మొత్తం టోర్నమెంట్‌లో కష్టపడి విజయం సాధించిందని, అయితే ట్రోఫీని అందుకోలేకపోవడం బాధ కలిగించిందని అన్నాడు. “నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి, ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీని ఇవ్వకపోవడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. అలాగే నాకు తెలిసి ఇలా చేయడం ఇదే మొదటిసారి…
Asia Cup 2025: ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్‌లో సూపర్-4 దశకు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు స్థానం సంపాదించగా.. తాజాగా గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా అర్హత సాధించాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్-B చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4లోకి ప్రవేశించింది. ఒకవేళ…