Asia Cup Trophy Controversy: ఆసియా కప్ ట్రోఫీ "దొంగ" అయిన పాకిస్థాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీని బీసీసీఐ వదిలిపెట్టే స్థితి కనిపించడం లేదు. ఇంతలో మరో ప్రధాన వార్త వెలువడింది. ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేశారు. అయితే.. ఈ ట్రోఫీని టీం ఇండియాకు ఎప్పుడు అందజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.