భారత యానిమేషన్ రంగానికి.. మరో గర్వకారణంగా ‘మహావతార్ నరసింహా’ సినిమా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం 98వ ఆస్కార్ నామినేషన్స్‌లో యానిమేషన్ కేటగిరీలో ఈ మూవీ చోటు దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించింది. పురాణ ఇతిహాసాలపై ప్రేక్షకుల ఆసక్తి ఎంత ఉందో, యానిమేషన్ రంగంలో ఇలాంటి ప్రయోగాలకు ఎంత అవకాశముందో ‘మహావతార్’ విజయమే నిరూపించింది. హిరణ్యకశ్యపుని సంహరించిన నరసింహ స్వామి కథతో పాటు, ప్రహ్లాదుని భక్తి, ప్రతి సన్నివేశం లో…
Mahavatar Narsimha : మహావతార్ నరసింహా మూవీ దిగ్విజయంగా దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే తీసుకొచ్చిన ఈ యానిమేషన్ మూవీని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెళ్తున్నారు. రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగానే వసూలు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా మూవీ విషయంలో తన కష్టాలను…
హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నర్సింహా’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదరకొడుతుంది. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా, ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా అశ్విన్ కుమార్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరారు. అశ్విన్ కుమార్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు – రైటర్, ఎడిటర్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన స్థాపించిన క్లీమ్ VFX స్టూడియో,…
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 'కేజీయఫ్', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మొట్టమొదటి యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ'. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న 3డీ ఫార్మాట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.