Mahavatar Narasimha : 98వ ఆస్కార్ రేసులో.. ‘మహావతార్ నరసింహా’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యానిమేషన్ రంగానికి.. మరో గర్వకారణంగా ‘మహావతార్ నరసింహా’ సినిమా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం 98వ ఆస్కార్ నామినేషన్స్‌లో యానిమేషన్ కేటగిరీలో ఈ మూవీ చోటు దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించింది. పురాణ ఇతిహాసాలపై ప్రేక్షకుల ఆసక్తి ఎంత ఉందో, యానిమేషన్ రంగంలో ఇలాంటి ప్రయోగాలకు ఎంత అవకాశముందో ‘మహావతార్’ విజయమే నిరూపించింది. హిరణ్యకశ్యపుని సంహరించిన నరసింహ స్వామి కథతో పాటు, ప్రహ్లాదుని భక్తి, ప్రతి సన్నివేశం లో కనిపించిన డివోషనల్ వైబ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మంచి సంగీతం, ఆకట్టుకునే సన్నివేశాలు కలిసి ఈ సినిమాకు భారీ హైప్‌ను తీసుకువచ్చాయి. ఈ విజయాన్ని చూసిన అనేక ప్రొడక్షన్ హౌస్‌లు యానిమేషన్ సినిమాల వైపు మళ్లడం కూడా జరిగింది.
Also Read : Meena : ఏ హీరో విడాకులు తీసుకున్న నాకే లింక్ చేస్తున్నారు – మీనా ఫైర్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
హోంబలే ప్రొడక్షన్స్ సుమారు 30 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ ఎంతో నిబద్ధతతో తెరకెక్కించారు. అలా థియేట్రికల్ రన్‌లో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇప్పటికే రికార్డులు.. రివార్డులు అందుకున్న ‘మహావతార్’ ఇప్పుడు ఆస్కార్ నామినేషన్‌తో మరోసారి తన రేంజ్‌ను నిరూపించింది. అయితే పోటీలో ‘పాప్ డీమన్ హంటర్స్’, ‘ఇన్ఫినిటీ కాస్టెల్’, ‘డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా’ వంటి హాలీవుడ్ యానిమేషన్ దిగ్గజాలు కూడా ఉన్నాయి. విజువల్ క్వాలిటీ, నిర్మాణ విలువల్లో కొన్ని ఫ్రేములు హాలీవుడ్ రేంజ్‌ను తలపించినా, తుది ఫలితం ఎలా వస్తుందొ చూడాలి. ఆస్కార్ దక్కుతుందా లేదా అన్నది పక్కన పెడితే, యానిమేషన్ రంగానికి ‘మహావతార్ నరసింహా’ ఇచ్చిన గుర్తింపు మాత్రం ఇండియాలో మరిన్ని భారీ యానిమేషన్ ప్రాజెక్టులకు దారితీస్తుందనే చెప్పాలి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?