సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత కొన్ని సందర్భాల్లో అసలు వార్త ఏది? వైరల్ ఏది..? ఫేక్ ఏది తెలియని పరిస్థితి ఏర్పడింది.. కొందరు అదే నిజమని కూడా నమ్మేస్తున్నారు.. తాజాగా, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటన హల్‌చల్ చేస్తోంది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థని.. సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తామని అచ్చెన్న పేరుతో నకిలీ ప్రకటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అయితే, ఈ ప్రకటనను…
ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై టీడీపీ నేతలు మండిపడుతూనే వున్నారు. అసెంబ్లీ జగన్ భజన సభలా మారింది. సభలో మాట్లాడకుండా మా గొంతు నొక్కారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప. కల్తీ సారా,నకీలీ మద్యంపై సభలో చర్చించాలని ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి సభలో అవాస్తవాలు చెప్పారు. ఇకనుంచి ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తాం. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే…
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టీడీపీ నేతలపైనే కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు.. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. ఈ కేసులో.. ఏ1గా నారా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి…