ఆయనో కేంద్ర మాజీ మంత్రి. 30 ఏళ్ల రాజకీయ అనుభవం. అలాంటి పెద్దాయన ‘మనసు…గాయపడింది. తాడేపేడో తేల్చేయాలని నిర్ణయించుకున్నారట. రూట్ మార్చి లేఖల యుద్ధం ప్రారంభించారు. ఇంతకీ ఆయన ‘పోరాటం’ ఫలిస్తుందా!? ఇప్పుడు రోజూ వార్తల్లో వ్యక్తి అయ్యారు! అశోక్ గజపతిరాజు. టీడీపీ సీనియర్ నేత. పార్టీలో కూడా ఆయన్ను రాజుగానే ట్రీట్ చేసేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రముఖంగా కనిపించేవారు. అది కూడా అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే. కేంద్రం, రాష్ట్రంలో ఎక్కడైనా సరే…