Ashish Reddy: యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. అద్వైత రెడ్డితో అతడి వివాహం జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆశిష్, అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక టాలీవుడ్ లో సగానికి పైగా ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు.