Ashish Reddy: ఘనంగా యంగ్ హీరో పెళ్లి.. హైలైట్ గా దిల్ రాజు డ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Reddy: యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. అద్వైత రెడ్డితో అతడి వివాహం జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆశిష్, అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక టాలీవుడ్ లో సగానికి పైగా ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు. ఇక ఈ పెళ్ళిలో హైలైట్ అంటే దిల్ రాజు అనే చెప్పాలి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకే ఆశిష్ అన్న విషయం తెల్సిందే. తమ్ముడు కొడుకు పెళ్లి అయినా కూడా దిల్ రాజు తన కొడుకగానే చూసుకున్నాడు. ఇక పెళ్ళిలో కూడా శిరీష్ కన్నా ఎక్కువగా దిల్ రాజు హంగామా చేయడం ఆకట్టుకుంటుంది. ఆశిష్ పెళ్ళిలో దిల్ రాజు డప్పు కొడుతూ.. డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక దిల్ రాజు కు ఒక కుమార్తె హర్షిత రెడ్డి అని అందరికీ తెల్సిందే. ఆమె మొదటి భార్య కూతురు.. ఇప్పుడు రెండో భార్యకు ఒక కుమారుడు. నటన పరంగా శిరీష్ కొడుకు ఆశిష్ నే దిల్ రాజు తన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా హిట్ అందుకోలేకపోయిన.. ఒక మోస్తరుగా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆశిష్ సెల్ఫిష్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ మధ్యనే ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
- Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
- Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
- King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!