ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనపై మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది… యూపీ సర్కార్ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన సుప్రీంకోర్టు.. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.…