ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్‌తో పాటు పార్టీని కూడా ఛార్జీషీటులో చేర్చింది.
Delhi Liquor Policy Case: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ పేరును దర్యాప్తు సంస్థ ఛార్జిషీటులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుడిగా పేర్కొంది
సార్వత్రిక ఎన్నికల వేళ స్వాతి మాలివాల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం చల్లారక ముందే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది.
Swati Maliwal Case: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిన్న స్వాతి మలివాల్ తనపై జరిగిన దాడిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Yogi Adityanath: ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని పదవి నుంచి దించేస్తుందని అన్నారు.
Arvind Kejriwal: తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఓటేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లో ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
Swati Maliwal Row: స్వాలి మలివాల్ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని కుదిపేస్తోంది. వారం ప్రారంభంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో రాజ్యసభ ఎంపీ, మాజీ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన మలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు.
మరోసారి భారతీయ జనతా పార్టీ గెలిస్తే యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ ప్రకటించారు. భారత కూటమికి ఓటు వేయాలని ఉత్తరప్రదేశ్ ఓటర్లను విజ్ఞప్తి చేయడానికి నేను ఈ రోజు లక్నోకు వచ్చాను అని కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై తీర్పు వెలువరించే అవకాశం ఉందని అంచనా. ఈ కేసును న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించనుంది.