Delhi Liquor Policy Case: మరిన్ని చిక్కుల్లో ఆప్.. ఈడీ ఛార్జిషీట్‌లో తొలిసారి రాజకీయ పార్టీ పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Policy Case: దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ పేరును దర్యాప్తు సంస్థ ఛార్జిషీటులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని నిందితుడిగా పేర్కొంది. శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఆప్ పేరును ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. మార్చి నెలలో ఆయను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని చెప్పింది.
Read Also: Jaishankar: ‘‘పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.’’ .. పాకిస్తాన్‌కి జైశంకర్ వార్నింగ్..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఈ కుంభకోణంలో తాజాగా దాఖలైన ఛార్జిషీట్ 8వది కాగా, ఢిల్లీ సీఎం పేరు ఉన్న మొదటి ఛార్జిషీట్. ఈ కేసులో మరో ఇద్దరు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌పై కూడా అభియోగాలు ఉన్నాయి. అయితే ఆప్‌ని నిందితుడి పేర్కొనడం పార్టీకి పెను పరిణామాలు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఈడీ ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆప్ గుర్తింపు రద్దు కావచ్చు. ఈ పార్టీ గుర్తింపును రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా ఈడీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరే అవకాశం ఉంది.
మరోవైపు రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ దాడి చేయడం ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిభవ్ కుమార్ తనను 7 సార్లు చెంపపై కొట్టారని, అంతే కాకుండా కడుపు, ఇతర సున్నిత భాగాలపై కాలితో తన్నినట్లు ఆమె ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై ఈ రోజు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ టీం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ క్రియేషన్ కోసం స్వాతి మలివాల్‌ని అక్కడకు తీసుకెళ్లారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!