ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ సోమవారం విచారణ జరిపారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.
MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారించనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోసం ఇండియా కూటమి రంగంలోకి దిగబోతుంది. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్టై.. తీహార్ జైల్లో ఉంటున్నారు. దాదాపు నాలుగు నెలల నుంచి జైల్లో ఉండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర జరగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.
హర్యానాలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ-పంజాబ్ లాగానే ఇప్పుడు హర్యానాలో కూడా అదే మోడల్‌ను తీసుకురావాలని ఆప్ ప్రయత్నిస్తోంది.
ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ షుగర్ 8 సార్లు 50 కంటే కిందకు పడిపోయిందని అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గిపోయారని ఆ పార్టీ సంజయ్ సింగ్ ఆరోపించారు. తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆప్ మంత్రి అతిషి సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు.
Kejriwal Health Condition: లిక్కర్ స్కామ్ కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువు తగ్గాడన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు రియాక్ట్ అయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.