తాను ప్రాతినిధ్యం వహించే హుబ్లీ- ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్‌కు 58 ఎకరాల భూమి కేటాయించినా ఈ టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ ఆరోపించారు. ఇన్ఫోసిస్‌కు కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.