Golconda Bonalu: తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు జూలై 7న ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. జంటనగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోల్కొండ కోటలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు బారికేడ్ల నిర్మాణంతో పాటు…