ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అంటూ ఆయన అన్నారు. పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి ఆరోగ్యశ్రీకి వెంటనే నిధులు ఇవ్వాలన్నారు. వైసీపీ పాలకులు ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.