అగ్నిపథ్ పథకంపై దేశంలో అగ్గి రాజుకుంది.. దేశవ్యాప్తంగా ఆందోళనలు, విధ్వంసాలతో అట్టుడికిపోయింది.. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. ఓవైపు నిరసనలు, ఆందోళనలు.. ఇలా దేశవ్యాప్తంగా ఏదో రూపంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కార్యాచరణ సాగుతూనే ఉంది. అయితే, కేంద్రం మాత్రం అగ్నిపథ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు.. ఈ విషయంలో మరో ముందుడు వేసింది నరేంద్ర మోడీ సర్కార్.. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు ముసాయిదా నోటిషికేషన్ జారీ చేసింది. ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్…