జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులపై ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సుజలిగల'లో హీరోగా నిలిచిన కెంట్ అనే జాగిలానికి మరణానంతరం రాష్ట్రపతి శౌర్య పురస్కారం ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 11న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ జాగిలం ప్రాణాలు కోల్పోయింది.
Jammu Kahmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో రాజౌరీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మంగళవారం సాయంత్రం జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్ లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆర్మీ డాగ్ యూనిట్ కి చెందిన కెంట్ అనే ఆరేళ్ల ఆడ లాబ్రడార్ కాల్పుల్లో మరణించింది.