Greenland: ఆర్కిటిక్ ద్వీపం, డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. దీనిని అమెరికాకు ఇచ్చేయాలంటూ ట్రంప్ డెన్మార్క్‌ను బెదిరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యూరప్ దేశాలు అన్ని ఒక్కటయ్యాయి. గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తును గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ మాత్రమే నిర్ణయించుకోగలవని మంగళవారం యూరోపియన్ నాయకులు ప్రకటించారు.