ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం అయింది. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, హెలీ రైడ్స్ ఒక పక్క.. గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క.. ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి..