ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం అరకు కాఫీని స్పీకర్, డిప్యూటీ సీఎంలకు స్వయంగా అందించారు. అనంతరం స్టాల్ వద్ద అరకు కాఫీ బాక్సులను సబ్యులకు అందజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇక నుంచి అరకు కాఫీ అందుబాటులోకి రానుంది. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలని ఏపీ ప్రభుత్వం…