మన మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. మోడీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బికనీర్‌లో ఏర్పాటు చేసిన సభలో పహల్గామ్ గురించి మాట్లాడుతూ.. పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహారాలోని గోరి ప్రాంతంలో ఉన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి చేశాయి. ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గుర్రీగా గుర్తించబడిన ఉగ్రవాది.. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ట్రాల్‌లో ఉన్న ఇంటిని…