ఈనెల 17 నుంచి 24 వరకు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, అదనపు కలెక్టర్ రాజేశం, వరుణ్‌రెడ్డి హాజరయ్యారు. ప్రాణహిత పుష్కరాలకు భక్తులకు ఎలాంటి…